అనగనగనగా అరవిందట.. ఎన్టీఆర్ మొదటి సాంగ్ వచ్చేసింది

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా నుండి మొదటి పాట రిలీజ్ అయ్యింది. అనగనగనగా అరవిందట అంటూ తమన్ మార్క్ కనిపించేలా ఈ సాంగ్ ఉంది. సీతారామశాస్త్రి రచన త్రివిక్రం సినిమా కథకు కావాల్సిన భావం మొత్తం ఈ పాటలో కనబడుతుంది.. వినపడుతుంది. అక్టోబర్ 10న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 20న రిలీజ్ చేస్తున్నారు.

ఎన్.టి.ఆర్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇయర్ వచ్చే మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటైన అరవింద సమేత మొదటి సాంగ్ సూపర్ హిట్ అవగా సినిమాలోని అన్ని సాంగ్స్ ఇదే రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news