వైరల్ అవుతున్న పాత ట్వీట్లు.. పాయల్ పై విరుచుకుపడుతున్నారుగా..

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలన్నీ ఆధారం లేనివని అనురాగ్ కామెంట్ చేసాడు. ఈ విషయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలు అందరూ అనురాగ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. అనురాగ్ తో పని చేసిన చాలా మంది తానెలాంటి వాడో చెబుతూ సపోర్ట్ గా ఉంటున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా అనురాగ్ కి మద్దతుగా ఉంటూ ట్వీట్ చేసాడు. ఐతే తాజాగా పాయల్ ఘోష్ పాత ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

ఆ ట్వీట్లలో ఇండస్ట్రీ గురించి మాట్లాడిన పాయల్, ఇక్కడ ఎవరూ రేప్ చేయరు. మీరు సౌకర్యంగా లేకపోతే ఛాన్స్ తీసుకుందామని చూస్తారు. అలాంటప్పుడు చద్దని చెప్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి పెద్ద సీన్ క్రియేట్ చేయొద్దంటూ పోస్ట్ పెట్టింది. ఎప్పుడో పెట్టిన ఈ పోస్టుని అనురాగ్ అభిమానులు తవ్వి తీసి ఈ ట్వీట్ డిలీట్ చేయడమ్ మరిచిపోయినట్టుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పాయల్ పై విమర్శలు చేస్తున్నారు. మరి పాయల్ ఘోష్, ఇప్పుడేమంటుందో చూడాలి.