పబ్లిక్‌గా ముద్దుల వర్షం కురిపించిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్

-

మొదటి సినిమాతో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది బ్యూటిఫుల్ పాయల్ రాజ్ పుత్. తన సొగసుల ఆరబోతతో ఈ పంజాబీ భామ..ప్రతీ ఒక్కరి గుండెలను గాయపరిచిందని చెప్పొచ్చు. ‘‘RX100’’ ఫిల్మ్ లో బోల్డ్ రోల్ ప్లే చేసి ప్రేక్షకులను అలరించింది.

ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ ఒక్క విషయం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. కాగా, తాజాగా ఈ భామకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

జీ తెలుగు వారు నిర్వహిస్తున్న ‘‘జీ మహోత్సవం’’ షో లో తన డాన్స్ తో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు తన డాన్స్ పార్టనర్‌కి లిప్ కిస్ కూడా ఇచ్చింది. అలా సదరు వీడియోలో ముద్దుల వర్షమే కురిపించింది ఈ సుందరి. ఈ క్రమంలోనే యాంకర్ శ్రీముఖి..డ్యాన్స్ పార్ట్ నర్ లవరా? అని అడిగింది. ‘బేబీ’ అని అతన్ని పిలుస్తారా? అని ప్రశ్నించింది. ఇంతకీ అతను ఎవరు? అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సింది. ఈ వీడియో ప్రోమో ప్రజెంట్ యూ ట్యూబ్ లో వైరల్ అయిపోయింది. పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం ‘‘5Ws, కిరాతక, గోల్ మాల్, తీస్ మార్ ఖాన్, హెడ్ బుష్’ చిత్రాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news