సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ జాతీయ పర్యటనకు బయలు దేరారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. ఇక్కడ సీఎం కేసీఆర్ బృందానికి ఢిల్లీ డెప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సాదర స్వాగతం పలికారు. అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్ తిలకించారు.
పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు వివరించారు. అనంతరం సీఎం బృందం పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్ మహమ్మద్‌పూర్ మొహల్లా క్లినిక్‌ను సందర్శించనున్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ మధ్యాహ్నం సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఇద్దరు నేతలు జాతీయ అంశాలతో పాటు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిసింది.