అమ్మో సినిమానా అంటున్న జనం…!

మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు అంటే జనాలకు ముందు నుంచి కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం అనేది ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు తో వారం తో సమయంతో సందర్భంతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తూ ఉంటారు. అలాంటి తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సినిమా అంటే భయపడే పరిస్థితికి వచ్చారు. సినిమాలు ఎలాగూ విడుదల అయ్యే అవకాశం లేదు. విడుదల అయినా సరే జనాలు చూసే అవకాశం లేదు.

సినిమా వచ్చినా సరే హాల్ కి వెళ్లి చూసే పరిస్థితి లేదు అని అంటున్నారు. జనాలకు ఇప్పుడు ప్రాణ భయం ఎక్కువగా ఉంది. అందుకే ఎవరూ కూడా ఇప్పుడు హాల్ కి వెళ్ళే విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. సినిమా విడుదల చేసినా చూస్తారా చూడరా అనే భయం నిర్మాతలకు కూడా ఉంది. కరోనా గురించి జనాలకు ఇప్పుడే అర్ధమవుతుంది.

అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా పట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అంత హడావుడి లో సినిమాకు వెళ్లి ఇబ్బందులు తెచ్చుకోవడం అవసరమా అనే భావనలో ఉన్నారు. అగ్ర హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా సరే చూసే పరిస్థితి ఇప్పుడు దాదాపుగా లేదు. అందుకే అగ్ర దర్శకులు కూడా ఈ ఏడాది సినిమాలను విడుదల చేసే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.