ప్రభాస్ చాలా బాగుంటాడు; పూజ హెగ్డే

-

టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే హవా నడుస్తుంది. అగ్ర హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో వరుసగా సినిమాలు చేసిన ఈ హీరోయిన్ వారితో హిట్స్ కొట్టింది. ప్రస్తుతం అక్కినేని హీరో అఖిల్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సినిమాలు చేస్తుంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ప్రభాస్ హీరో. ఈ హీరోలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఇటీవల జార్జియా లో షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

ఇటీవల అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మాయి నటించి మెప్పించింది. ఈ సినిమా హిట్ కావడంతో పాప దశ తిరిగిపోయింది. ఇక తాజాగా తను సినిమా చేస్తున్న ప్రభాస్ గురించి కొన్ని కీలక విషయాలు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజ మాట్లాడుతూ… ప్రభాస్ ఇంతవరకు కనిపించని స్టైల్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో ఈ సినిమాలో కనిపించనున్నాడని చెప్పింది.

ప్రతీ ఫ్రేమ్ ఓ విజువల్ వండర్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది. నాకే అలా అనిపిస్తే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో ఊహించగలనని వ్యాఖ్యానించింది. సెట్‌లో ప్రభాస్ చాలా సరదాగా ఉంటారని… ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని చెప్పింది. ఆయనతో కలిసి పనిచేయడం చాలా బాగుంటుందని చెప్పుకొచ్చింది. తర్వాతి షెడ్యూల్‌లో ప్రభాస్‌కు, నాకు మధ్య రొమాంటిక్ సీన్స్‌ను తెరకెక్కించనున్నారని సినిమా విశేషాలను పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news