పూజా హెగ్దేకు క‌రోనా పాజిటివ్‌.. ల‌క్ష‌ణాలు లేవంటే ట్వీట్‌!

క‌రోనాతో వ‌రుస‌గా సినీ ప్ర‌ముఖులు వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఒక‌రు కోలుకున్నార‌నుకునే లోపే మ‌రొక‌రు పాజిటివ్ అంటూ చెప్తున్నారు. దీంతో వ‌రుస‌గా సినిమా షూటింగులు ఆగిపోతున్నాయి. మొన్న‌టి దాకా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర‌వింద్‌, దిల్ రాజు, నివేదా థామ‌స్ లాంటి వాళ్లు క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు. ఇక ఇప్పుడు మ‌రో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రోనా బారిన ప‌డింది.

 

హీరోయిన్ పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్ గా వ‌చ్చింది. ఈ విషయాన్ని త‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. కాగా తాను ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని, ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని తెలిపింది. అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాన‌ని చెప్పింది. త‌న‌న రీసెంట్ గా క‌లిసిన వారు టెస్టులు చేయించుకోవాల‌ని కోరింది. దీంతో ఆమె ప‌నిచేస్తున్న సినిమా మేక‌ర్స్ ఆందోళ‌న చెందుతున్నారు. వారంతా ఇప్పుడు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అంతే కాదు ప్ర‌స్తుతం ఆమె చేస్తున్న సినిమాలు షూటింగ్ ఆపేసిన‌ట్టు స‌మాచారం.