అతనితో ప్రేమలో ఉన్న పూజ హెగ్డే ?

-

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. మొదటి సినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’ సినిమా లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే తరువాత డీజే మరియు అరవింద సమేత వీర రాఘవ సినిమాల్లో నటించి అద్భుతమైన విజయాలు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ అండ్ క్రేజీ హీరోయిన్ గా స్టార్ హీరోల పక్కన వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.

Related image

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ లాంటి హీరోలతో నటించి విజయాలు సొంతం చేసుకున్న పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి నేపథ్యంలో పూజాహెగ్డే ఒక అతనితో ప్రేమలో పడినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

మేటర్ ఏమిటంటే బజార్ సినిమా స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాతో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది.  ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. మరి వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే పూజా హెగ్డే స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రభాస్ జిల్ ఫేమ్ డైరెక్ట్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ప్రేమ కథ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. 

 

Read more RELATED
Recommended to you

Latest news