200 కోట్ల రూపాయిల భారీ స్కాం కేసులో ప్రముఖ స్టార్ హీరోయిన్ అరెస్ట్..?

బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరు జాక్వలిన్ ఫెర్నాండేజ్..ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదనే చెప్పాలి..సౌత్ లో ఈమె ఒక్క సినిమా చెయ్యకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది..ఇటీవలే కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోనా’ సినిమాలో ‘రామ్మా రక్కమ్మ’ అనే ప్రత్యేక పాట లో ఆడిపాడి యూత్ ని ఉర్రూతలూ ఊగించింది..ఎక్కడ చూసిన ఈ పాటే ఇప్పుడు మార్మోగిపోతోంది..ఇదంతా పక్కన పెడితే గత కొంతకాలం నుండి ఈమె ఒక మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..

సుఖేష్ చంద్రశేఖర్ అనే ప్రముఖ పారిశ్రామిక వేత్త చేసిన 200 కోట్ల రూపాయిల మనీ లాండరింగ్ కేసు లో జాక్విలిన్ ఫెర్నాండేజ్ హస్తం కూడా ఉందని ED అధికారులు తేల్చి చెప్పారు..ఈ క్రమం లోనే ఇటీవలే ఢిల్లీ సుప్రీమ్ కోర్టుకు సమర్పించిన సప్లమెంటరీ ఛార్జిషీట్ లో జాక్విలిన్ పేరు ని కూడా చేర్చారు అధికారులు..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే సుఖేష్ చంద్ర శేఖర్ అనే వ్యక్తి రాన్ భక్షి అనే యాడ్ ఏజెన్సీ ప్రోమోటర్లను 200 కోట్ల రూపాయిలు మోసం చేసాడు..అంతే కాకుండా ఇతను గత కొంతకాలం నుండి జాక్వలిన్ ఫెర్నాండేజ్ తో డేటింగ్ లో ఉంటున్నాడు..ఆమెతో డేటింగ్ లో ఉంటున్న సమయం లో సుఖేష్ ఎన్నో విలువైన బహుమతులను ఇచ్చేవాడు..ఇప్పుడు జాక్విలిన్ దగ్గర నుండి ఆ విలువైన వస్తువులను స్వాధీన పర్చుకున్నారు ED అధికారులు..మల్విందర్ సింగ్ మరియు శివీంధర్ సింగ్ కు ఒక జటిలమైన కేసు లో బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పి, వాళ్ళిద్దరి భార్యలను మోసం చేసి 200 కోట్ల రూపాయిలు తీసుకున్నాడు..

కానీ ఇప్పటి వరుకు బైలు రప్పించడానికి సుఖేష్ ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు..రోజులు గడిచిపోతూ ఉన్నాయి..కానీ సుఖేష్ నుండి బైలు కి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు..దీనితో శివీంధర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది..ఆధారాలన్నీ పక్కాగా ఉండడం తో గత ఏడాది పోలీసులు సుఖేష్ ని అరెస్ట్ చేసారు..అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు జరుపుతున్న విచారణలో జాక్విలిన్ పేరు కూడా బయటకి వచ్చింది..అయితే ఇప్పుడు జాక్విలిన్ కూడా ఈ కేసు లో అరెస్ట్ అవ్వబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.