భోజనం చేసి వెళ్ళండి డార్లింగ్స్.. ప్రభాస్ వీడియో వైరల్

కేంద్ర మాజీమంత్రి సినీ నటులు కృష్ణంరాజు సంస్మరణ సభకు ఆయన స్వగ్రామం మొగల్తూరులో భారీ ఏర్పాట్లు చేపట్టారు. కృష్ణంరాజు నివాసానికి ఇప్పటికే చేరుకున్న కుటుంబ సభ్యులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హీరో ప్రభాస్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు.

మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు సంస్మరణ సభకి హీరో ప్రభాస్ హాజరు కావడంతో… అభిమానులు భారీగా వచ్చారు. ఇక ఈ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులకు ప్రభాస్ అభివాదం చేశారు. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్లాలని ఆప్యాయంగా పిలుపు నిచ్చారు.

 

అంతే కాదు భోజనం చేసి వెళ్ళండి డార్లింగ్స్ అంటూ తన స్టైల్ లో చెప్పారు ప్రభాస్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా ప్ర భాస్ ను చూసేందుకు ఉభయ గోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో మొగల్తూరులోని కృష్ణంరాజు నివాసం వద్ద కోలాహలం నెలకొంది.