సైనికుడి పాత్రలో ప్రభాస్.. సినిమాకు క్రేజీ టైటిల్

-

‘కల్కి 2898ఏడీ’తో వెయ్యికోట్ల మైలు రాయిని దాటేసి, రికార్డుల వేటలో ఉన్న ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సలార్-2, కల్కి పార్ట్-2, రాజాసాబ్, స్పిరిట్ సినిమాలకు పచ్చ జెండా ఊపిన రెబల్ స్టార్ చేతిలో మరో ప్రాజెక్ట్ చేరిపోయింది. ‘సీతారామం’ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ అనుకుంటున్నట్లు తెలిసింది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్ లో ఎప్పుడూ పోషించిన పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు  ‘ఫౌజీ’ అనే టైటిల్‌ అనుకుంటునట్టు తెలుస్తోంది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నాడట. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో కథానాయికగా మృణాల్ ఠాకూర్‌ ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version