డైలమాలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ క్రేజ్ పోతుందనేనా …?

-

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఏకైక పాన్ ఇండియా స్టార్ అంటే ఒక్క ప్రభాస్ మాత్రమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాకోసం ఎంతగా కష్ట పడ్డారో అంతకు అంతగా .. అన్నట్టు ప్రభాస్ కి రాజమౌళి ఈ క్రేజ్ ని సంపాదించి పెట్టారు. బాహుబలి ప్రాంఛైజీ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ స్టార్ గా ఎదిగాడు. ఆ క్రేజ్ తో ఇక చిన్న బడ్జెట్ సినిమాలని చేయడం లేదు. బాహుబలి కన్‌క్లూజన్ షూటింగ్ లో ఉండగానే సుజీత్ ఈ సినిమా కోసం రెడీ అయిపోయాడు. ఇక బాహుబలి కన్‌క్లూజన్ రిలీజ్ రోజు నుండే సాహో టీజర్ ని రిలీజ్ చేసి సినిమా మీద భారీగా అంచనాలు పెంచేశారు.

 

 

 

బాహుబలి క్రేజ్ తోనే సాహో సినిమాని 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో ప్రభాస్ కి షేర్ ఉండటం ఆసక్తికరమైన విషయం. ప్రపంచ వ్యాప్తంగా భారీగా అంచనాలు పెట్టుకుంటే భారీగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి సాహో తో దాదాపు 20 కోట్ల వరకు నష్టం వచ్చిందని అన్నారు. బాలీవుడ్ లో కాస్త క్రేజ్ వల్ల ఒక మోస్తారుగా ఆడింది. ఇక మిగతా అన్ని భాషల్లో ప్రభాస్ కి, యు వి బ్యానర్ కి షాకిచ్చింది. దాంతో సాహో ఎకెఫ్ట్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా మీద పడింది.

జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా చిత్రానికి ఇప్పుడు అన్ని సమస్యలు చుట్టు ముట్టాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే అవాంతరాలు ఎదురవుతున్నాయి. సాహో తో వచ్చిన నష్టాలాను ఈ సినిమాతో పూడ్చుకోవాలనుకున్న మేకర్స్ కి ఈ సినిమా ఇప్పుడే గట్టి షాకులిస్తోంది. ఇప్పటికే అనుకున్న దానికంటే సగం బడ్జెట్ కి దిగిపోయారు ప్రభాస్ బృందం. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఇంకా భారీగా పడిందని తెలుస్తోంది. అందరికంటే ఎక్కువగా ప్రభాస్ వరీ అవుతున్నాడట. బాహుబలి సినిమాతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ పోతుందా అన్న డైలమాలో ఉన్నాడట. ఇప్పటికే కథ లో మార్పులు చేర్పులు .. టైటిల్ విషయంలో క్లారిటి లేకపోవడం వేసిన సెట్స్ వేస్ట్ అవడం ఇలా అన్ని ఈ సినిమాకి భారంగా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version