ప్రభాస్ సినిమా ఎప్పుడూ స్టార్ట్ అంటే…?

-

బాహుబలి సినిమా తర్వాతి నుంచి ప్రభాస్ క్రేజ్ ఒక స్థాయిలో పెరిగిపోయింది. ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు అక్కడి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సినిమాల గురించి బాలీవుడ్ జనాలు కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇక ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ మరో సినిమాను ఓకే చేసాడు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక సూపర్ హీరోగా నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని… దర్శకుడు నాగ్ అశ్విన్ మొన్నే ఒక ప్రకటన చేసాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివ‌ర‌లో ప్రారంభించాల‌నుకుంటున్నామ‌ని,

వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని చెప్పాడు. ఈ ఏడాది చివరి నాటికి ప్రభాస్ చేస్తున్న ప్రస్తుత సినిమా అయుపోతుంది అనుకుని భావించారు. కాని కరోనా కారణంగా ఆగింది. ఈ సినిమా ప్రభావం నాగ్ అశ్విన్ తో చేసే సినిమాపై పడింది. ప్రస్తుత సమాచారం ప్రకారం ప్ర‌భాస్ 21వ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుండి మొద‌లు పెట్టే అవ‌కాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news