ప్రభాస్ పెళ్లెప్పుడంటే..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లెప్పుడు.. ఇది విన్న ప్రతి ఒక్కరు షాక్ అవడం ఖాయం. బాహుబలి టైంలో అడిగితే బాహుబలి పూర్తి కావడమే ఆలస్యం పెళ్లే అన్నట్టు ఊపు చేసిన ప్రభాస్ అండ్ ఫ్యామిలీ బాహుబలి తర్వాత కొద్దిరోజులు పెళ్లి హడావిడి చేసి మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు పెళ్లి అంటే సాహో కానివ్వండి అంటున్నారు.

ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు అడపాదడపా స్పందిస్తున్నా ప్రభాస్ ఇంకా టైం పడుతుందని చెబుతున్నాడు. ప్రస్తుతం నేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఓ పక్క ఇంకా ప్రభాస్ అనుష్కనే పెళ్లాడతాడని కూడా వార్తలు రాస్తున్నారు. ఈ ఇద్దరు ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

ఫైనల్ గా సాహో తర్వాత ప్రభాస్ పెళ్లాడటం ఖాయమని తెలుస్తుంది. కృష్ణంరాజు ఢిల్లిలో కూడా ప్రభాస్ పెళ్లి మ్యాటర్ డిస్కస్ చేస్తున్నారట. అక్కడ అమ్మాయైనా పర్వాలేదు అన్నట్టు తెలుస్తుంది. మరి మన ఛత్రపతి మనసు గెలిచి నిలిచే అమ్మాయి ఎవరన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news