యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండేలా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుండి ఓ యాక్షన్ వీడియో లీక్ అయ్యింది. ప్రభాస్ బైక్ మీద బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అయితే ఈ వీడియో మేకింగ్ దశలో ఉండటం వల్ల సినిమాకు పెద్ద నష్టమేమి లేదని అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల నుండి ఏ చిన్న వీడియో లీక్ అయినా అది వైరల్ అవడం ఖాయం అలానే సాహో నుండి ప్రభాస్ బైక్ రైడింగ్ వీడియో లీక్ అయ్యింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అబుదాబిలోని ఓ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. అంతేకాదు సాహో ఫస్ట్ టీజర్ లో చూపించినట్టుగ స్కై ఫైటింగ్ కూడా ఉంటుందట.
మొత్తానికి బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేయాలని అనుకున్నాడో దానికి పర్ఫెక్ట్ గా సాహో సూట్ అవుతుంది. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు.