ప్రగతి:హీరోయిన్గా కెరియర్ నాశనం కావడానికి అదే కారణమా..?

-

ఈమధ్య కాలంలో ప్రగతి మరింత పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. హీరో, హీరోయిన్స్ కు తల్లి పాత్రలలో చేయడం వెనుక పలు కారణాలు ఉన్నాయని తెలియజేసింది. ముఖ్యంగా తనకు 24 ఏళ్ల వయసుకే తల్లి పాత్రలలో నటించాలని తన వయసుకు సమానమైన హీరోయిన్స్ కి అమ్మగా నటించడం తనకు చాలా బాధగా అనిపించిందని తెలియజేస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సీనియర్ నటుడు చంద్రమోహన్ కుటుంబంతో తనకి మంచి అనుబంధం ఉందని చంద్రమోహన్ భార్య ను నేను ఆంటీ అని పిలిచేదాన్ని కానీ సినిమాలలో చంద్రమోహన్ భార్యగా చేయవలసి వచ్చిందని తెలియజేసింది.. కానీ ఆ పాత్ర చేసేటప్పుడు మాత్రం తనకి ఏడుపు ఆగకుండా వచ్చిందని ప్రగతి తన మనసులో బాధను తెలియజేసింది. షూటింగ్ సెట్లో ఉన్న సమయాలలో కూడా ప్రగతి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలియజేసింది. ముఖ్యంగా యంగ్ ఏజ్ లో అందంగా రెడీ అయి సెట్లోకి వెళ్తే కొంతమంది సూటి పోటి మాటలు అనేవారట. తల్లి పాత్ర చేసే ఈమెకు ఇంతగా అవసరమా అంటూ కామెంట్స్ చేసేవారట. ఆ మాటలు విన్న ప్రతిసారి ప్రగతి చాలా హర్ట్ అయ్యి మేకప్ రూమ్ లో వెళ్లి ఏడ్చే దానిని అంటు తెలియజేస్తోంది.

క్యాస్టూమ్స్ విషయంలోనే డైరెక్టర్ తో విభేదాలు రావడంతో హీరోయిన్గా వదిలేశానని తెలియజేస్తుంది. హీరోతో వర్షంలో ఒక సాంగ్ చేయవలసి ఉండగా తన కాస్ట్యూమ్స్ చూశాక చాలా ఇబ్బందిగా అనిపించిందని ఆ కాస్ట్యూమ్స్ లో నేను సాంగ్ చేయానని దర్శకుడికి చెప్పడంతో ఆ సినిమా నుంచి తనను తప్పించారని అలా సినిమాలు వదిలేసి సీరియల్స్ వైపు అడుగులు వేశానని తెలిపింది ప్రగతి. దాంతో తన హీరోయిన్ కెరియర్ ముగిసిందని తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news