అందంతో వ‌ల వేస్తున్న ప్ర‌గ్యాజైస్వాల్‌.. మ‌రీ ఇంత‌గానా!

ప్ర‌గ్యాజైస్వాల్ అంటే సినీ ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇప్ప‌టికే చాలా సినిమాల్లో న‌టించింది. కానీ గ‌త కొంత కాలంగా అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటోంది. మొద‌ట్లో బాగానే సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చినా.. ఆ త‌ర్వాత త‌గ్గిపోయాయి. కంచె, గుంటూరోడు, నక్షత్రం లాంటి సినిమాల్లో మెరిసినా.. ఈమెకు పెద్ద‌గా క‌లిసి రాలేదు. గ్లామ‌ర్‌, అందం, అభినయం అన్నీ ఉన్నా.. ఈమెకు పెద్ద‌పీట వేయ‌లేదు టాలీవుడ్‌.

ఇక కోలీవుడ్‌కు బాట ప‌ట్టినా.. అక్క‌డ కూడా అడ‌పాద‌డ‌పా సినిమాలే చేసింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేవు ఈ భామ‌కు. దాదాపు రెండేళ్లుగా ఒక్క సినిమాలోనూ ప్ర‌గ్యా జైస్వాల్ నటించలేదు. నిజం చెప్పాలంటే అవ‌కాశాలు రాలేదు.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ అవ‌కాశం కొట్టేసింది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ‘అఖండ’ సినిమాలో హీరోయిన్‌గా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇక ఈ పిల్ల సోష‌ల్ మీడియాలో త‌న అందంతో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. మిడ్డీలు, బికినీల్లో ఫొటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఇంత అంద‌మేంట్రా అంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు మీరు చూడండి.