Pawan Kalyan ప్రభాస్ పవన్ ఫ్యాన్స్ మధ్య అసలు గొడవ ఎలా మొదలైందంటే..!

-

Pawan Kalyan : అభిమానిని కొట్టి చంపిన ప్రభాస్ ఫ్యాన్..” సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కాలంలో గొడవలు మరింత ఎక్కువనే చెప్పాలి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరికొకరు గొడవలు పడుతున్నారు. అయితే ఇప్పటివరకు మాటల వరకూ మాత్రమే ఉన్న ఈ ఫ్యాన్స్ ఈసారి దారుణానికి ఒడిగట్టారు. ప్రభాస్ అభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ అభిమాని చనిపోవడం తీవ్ర దుమారానికి దారితీసింది.

Pawan Kalyan Prabhas
Pawan Kalyan Prabhas

సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఎక్కువగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే మెగా ఫాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నది ఇప్పటివరకు ఎవరూ కూడా హద్దు దాటి ప్రవర్తించలేదు. ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయని అభిమానులు తాజాగా హద్దు దాటి హంతకులుగా మారారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి లో జరిగింది.

అత్తిలిలో తమకు ఇష్టమైన స్టార్ హీరోల విషయంలో ఇద్దరు పెయింటర్ల మధ్య ఘర్షణ తలెత్తి అది కాస్తా హత్యకు దారితీసింది. ఏలూరుకు చెందిన పెయింటర్లు అత్తిలి మసీదు వీధిలో నజీర్ అనే వ్యక్తి ఇంటికి పెయింట్స్ వేస్తూ ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో ఒకరు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల క్రితం పెయింటర్లు హరికుమార్, కిషోర్ అత్తిలి వెళ్లారు. పెయింటర్ హరికుమార్ ప్రభాస్ ఫ్యాన్. దాంతో అతడు తన వాట్సాప్ లో ప్రభాస్ వీడియోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. మరో పెయింటర్ కిషోర్ ఏమో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని.

నేను పవన్ ఫ్యాన్ ని, నువ్వు కూడా ప్రభాస్ వీడియో తీసి పవన్ వీడియోని స్టేటస్ గా పెట్టుకో అని హరికుమార్ ను కోరాడు. దానికి హరికుమార్ ఒప్పుకోలేదు. నేను ప్రభాస్ కి వీరాభిమానిని, ప్రభాస్ వీడియోనే పెట్టుకుంటాని తేల్చి చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దీనిపై గత రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. ఇంకా ఈ విషయంతో కోపంతో ఊగిపోయిన హరికుమార్ …సెంట్రింగ్ కర్రతో కిషోర్ తలపై బలంగా కొట్టాడు. అంతేకాదు సిమెంటు రాయితో ముఖం మీద కొట్టాడు. అంతే, తీవ్రగాయాలతో కిషోర్ స్పాట్ లోనే చనిపోయాడు.

ఈ షాకింగ్ సంఘటనతో ఇరు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అభిమానులు గొడవలు పడిన ప్రతిసారి స్టార్ హీరోస్ తామంతా ఎంతో స్నేహంగా ఉంటామని కానీ మీరు మాత్రం ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారని ఇవన్నీ అనవసరమైన విషయాలని పలు మార్లు హెచ్చరిస్తూనే వచ్చారు. కానీ రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతున్నట్టు కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news