రాహుల్ గాంధీ ప్రసంగాలను లోక్ సభ రికార్డుల నుంచి తొలగించారు – గిడుగు రుద్రరాజు

-

బిజెపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు. గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా జై భారత్ సత్యాగ్రహ సభలను జిల్లాలో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించామన్నారు. అదాని అక్రమ ఆస్తులపై పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రసంగాలను లోక్ సభ రికార్డుల నుండి తొలగించారని మండిపడ్డారు. దేశ సమస్యలపై ప్రసంగాలని తొలగించిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడు లేదన్నారు గిడుగు. గడిచిన 9 ఏళ్లుగా రాహుల్ గాంధీ అనేక సమస్యలపై మాట్లాడుతున్నారని తెలిపారు.

అనేక ప్రాంతాల్లో ముస్లింలను కించపరుస్తు దాడులు జరిగాయని.. క్రిస్టియన్ల సంస్థలపై దాడులు జరిగాయన్నారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాని రద్దు చేసి ఇంటిని ఖాళీ చేయించిన ఘటన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని కదలించిందని.. ఇది అత్యంత దురదృష్టకరమైన చర్య అన్నారు. గాంధీ కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేసి సిబిఐ తో దాడులు చేయించారని.. ఫలితం లేకపోవటంతో ఇంటిని సైతం ఖాళీ చేయించారని అన్నారు. రాష్ట్రంలో సిఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, బిజేపి తో ఉన్న పవన్ ప్రస్తుత పరిణామాలపై కనీసం స్పందించని దద్దమ్మలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news