కేఏ పాల్‌ హత్యకు ప్రధాని మోడీ కుట్ర… వీడియో షేర్‌ చేసిన RGV

టాలీవుడ్‌ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సంచనాలు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఆర్జీవీ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్‌ చేస్తూ… కౌంటర్లు పేల్చుతుంటారు. ముఖ్యంగా రాజకీయ నేతల బయోగ్రఫీ లపై సినిమాలు తీస్తూ ఉంటారు వర్మ. అలాంటి రామ్‌ గోపాల్‌ వర్మ..ఈ మధ్య కాలంలో కేఏ పాల్‌ ను టార్గెట్‌ చేస్తున్నారు.

ఇటీవలే కేఏ పాల్‌ ప్రధాని అవుతారని.. పవన్‌ కళ్యాణ్‌ ఏపీ సీఎం అవుతారని ఆర్జీవీ వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది మరువక ముందే.. కేఏ పాల్‌ చేసిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ… అందరినీ ఆశ్చర్యపరిచాడు వర్మ. తననను హత్య చేసేందుకు ప్రధాని మోడీ పన్నాగం పన్నినట్లు కేఏ పాల్‌ అన్న వీడియోను ఆర్జీవీ షేర్‌ చేశారు.

”ప్రధాని మోడీ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. నేను రష్యా వెళుతున్న విషయం తెలుసుకుని.. హత్య చేయాలని అనుకున్నాడు. దీని కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో డీల్‌ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇండియాకు చెందిన ఓ అధికారి నాకు చెప్పాడు. ప్రధాని మోడీ నన్ను ఏం చేయలేడు. ”అంటూ ఈ వీడియో లో కేఏ పాల్‌ పేర్కొన్నాడు. అయితే.. ఈ వీడియోను ఆర్జీవీ షేర్‌ చేయగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.