నూరిన్ చేసిన కామెంట్లపై ప్రియా ప్రకాష్‌ను మీడియా వివరణ అడగ్గా.. ఆమె స్పందిస్తూ… ఒరు అదార్ లవ్ మేకింగ్ విషయంలో ఏం జరిగిందో చెబితే.. తనపై విమర్శలు చేసే వారి పరువే పోతుందని.. ప్రియా ప్రకాష్ తెలిపింది.
కన్నుగీటిన వీడియోతో ఓవర్‌నైట్ స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఆ తరువాత ఆమెకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. అలాగే సినీ నిర్మాతలు ఆమెకు తమ సినిమాల్లో ఆఫర్లను ఇస్తూ ముందుకు వచ్చారు. అయితే.. ఆమె నటించిన మళయాళ చిత్రం ఒరు అదార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడంతో దర్శకుడు ఒమర్ లులు, సహ నటి నూరిన్ షెరీఫ్ లు ఇప్పుడు ప్రియా ప్రకాష్‌పై సంచలన కామెంట్లు చేస్తున్నారు.
ఒరు అదార్ లవ్‌లో నటించిన నూరిన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ… చిత్రంలో తనది మొదట మెయిన్ రోల్ అని కానీ దాన్ని సపోర్టింగ్ రోల్ కింద మార్చేశారని, ప్రియా ప్రకాష్‌కు క్రేజ్ వచ్చాక అలా చేశారని.. దీంతో సినిమా స్వరూపం మారిపోయిందని, అందుకే సినిమా ఫ్లాప్ అయి ఉంటుందని నూరిన్ పేర్కొంది. అయితే ఇకపై ఎట్టి పరిస్థితిలోనూ ప్రియా ప్రకాష్‌తో కలిసి నటించనని, రోషన్‌తో మాత్రం నటిస్తానని నూరిన్ చెప్పుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రియా ప్రకాష్ వల్లనే తన కెరీర్ మొత్తం పోయిందని నూరిన్ తెలిపింది.
ఇక నూరిన్ చేసిన కామెంట్లపై ప్రియా ప్రకాష్‌ను మీడియా వివరణ అడగ్గా.. ఆమె స్పందిస్తూ… ఒరు అదార్ లవ్ మేకింగ్ విషయంలో ఏం జరిగిందో చెబితే.. తనపై విమర్శలు చేసే వారి పరువే పోతుందని.. ప్రియా ప్రకాష్ తెలిపింది. కాగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఒరు అదార్ అవ్ భారీ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు అందరూ ప్రియా ప్రకాష్‌ను టార్గెట్ చేసి మాట్లాడడం మొదలు పెట్టారు. మరి ముందు ముందు ఈ బ్యూటీ ఇంకెన్ని వివాదాలకు కారణమవుతుందో… వేచి చూస్తే తెలుస్తుంది..!