‘బాలీవుడ్ బోర్ కొట్టేసింది..’ షారుక్ వ్యాఖ్యలకు ప్రియాంక చోప్రా కౌంటర్

-

బాలీవుడ్ బ్యూటీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ తనకు బోర్ కొట్టేసింది అంటూ చెప్పుకొచ్చారు.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా నటించిన హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌. రుస్సో బ్రదర్స్‌ ఏజీబీఓ సంస్థ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ భారీ యాక్షన్‌ సన్నివేశాలతో, స్పై థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందింది. ఇందులో నటి ప్రియాంకా చోప్రాతో పాటు స్టాన్లీ మూసీ, లెస్లీమాన్వల్లే, రిచర్డ్‌ మాడాన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీబిజీగా గడుపుతుంది ప్రియాంక ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక గతంలో షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడారు.

 

అసలు విషయానికి వస్తే.. ఒక రిపోర్టర్ గతంలో షారుక్ ఖాన్ హాలీవుడ్ కి వెళ్తారా అని అడిగితే.. “నేను హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్లాలి ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది..” అంటూ చెప్పుకొచ్చారు కదా ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ‘సౌకర్యంగా ఉంటే నాకు బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అహంకారం లేదు. కానీ ఆత్మవిశ్వాసం ఉంది. సెట్లోకి వెళ్ళినప్పుడు నేనేం చేస్తాను నాకు చాలా బాగా తెలుసు ఇతరుల సలహా అవసరమే లేదు ఎప్పుడూ ఆడిషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను అలాగే ఎంత పని చేయడానికి అయినా సిద్ధమే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనదేశంలో సాధించిన విజయాల బరువుని మాత్రం మోసుకుంటూ వెళ్ళను అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news