కవిత ముందస్తు బెయిల్‌ దరఖాస్తు చేసుకోవచ్చు : జేడీ లక్ష్మీనారాయణ

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు అవ్వాల్సి ఉండగా, కవిత విచారణకు హాజరుకాబోరని ఆమె తరఫు న్యాయవాది, బీఆర్ఎస్ నేత సోమా భరత్ మీడియాతో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన ఈడీ అధికారులకు కూడా తెలపడం జరిగింది. ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా, ఈ నెల 20న విచారణకు రావాలంటూ ఈడీ కవితకు మరోసారి నోటీసులపంపడం జరిగింది.

Former CBI Joint Director reacts on Delhi Liquor Scam

అయితే ఈ నేపథ్యంలో ఆసక్తికర విషయాలు తెలిపారు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ . పీఎంఎల్ఏలోని సెక్షన్ 60 కింద కవితను విచారణకు పిలిచారని వెల్లడించారు ఆయన. పీఎంఎల్ఏ ప్రత్యేకమైన చట్టం అని తెలిపారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు కచ్చితంగా విచారణకు హాజరుకావాలని వెల్లడించారు. అదే సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చినట్టయితే ఓ మహిళను ఇంటికెళ్లి విచారిస్తారని లక్ష్మీనారాయణ తెలిపారు. సీఆర్పీసీ అనేది జనరల్ యాక్ట్ అని, అందువల్ల పీఎంఎల్ఏ చట్టం సీఆర్పీసీని మించి ఉంటుందని అన్నారు. అయితే, ఈడీ కోర్టులో కవిత ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news