బ్రేకింగ్ : శ్రావణి ఆత్మహత్య కేసులో నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్…

నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. శ్రావణి కేసులో అశోక్ రెడ్డి A3గా ఉన్నారు. శ్రావణి మరణించిన తర్వాత పరారీలో ఉన్న నిర్మాత అశోక్ రెడ్డి, సోమవారమే పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాతగా ఉన్న అశోక్ రెడ్డి, మొదట తాను నిర్మించిన ప్రేమతో మీ కార్తీక్ సినిమాలో ఆమెకు చిన్న అవకాశం ఇచ్చి పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకోవాలంటూ శ్రావణిని అశోక్ రెడ్డి వేధింపులకు గురి చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

దేవరాజ్, సాయి అశోక్ రెడ్డి వేధింపుల వల్లే శ్రావణి మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే దేవరాజ్ , సాయిలను అరెస్టు చేసిన ఎస్.ఆర్.నగర్ పోలీసులు. ఈరోజు అశోక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పంజాగుట్ట ఏసీపీ ఎదుట అశోక్ రెడ్డి లొంగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పిహెచ్సి కి కోవిడ్ టెస్ట్ కోసం తరలించారు. ఇక ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయకి ఈయన స్వయానా బాబాయ్. ప్రేమతో కార్తీక్, ఆర్ఎక్స్ 100, 90 ఎంఎల్ సినిమాలని ఈయన నిర్మించాడు.