ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. అంతర్జాతీయ వేదికపై ప్రాజెక్ట్​-కె టైటిల్​ రివీల్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్-కె. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రతి అప్డేట్ ప్రేక్షకుల అంచనాలను రోజురోజుకు పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు అంతర్జాతీయ వేదికగా అరుదైన గౌరవం దక్కింది.

అమెరికాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకలో ప్రాజెక్ట్-కె మూవీకి సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వేడుకలో ఈ చిత్ర టైటిల్, రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్లు తెలిపారు. జులై 19 నుంచి కామిక్ -కాన్ వేడుక ప్రారంభించనుంది. జులై 20వ తేదీ నుంచి జరగనున్న ఈ వేడుకలకు ప్రాజెక్ట్-కె టీమ్ హాజరు కానుంది.  అక్కడ ‘దిస్​ ఈజ్ ప్రాజెక్ట్ కె: ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ ఇండియాస్ మైథో-సైన్స్ ఫిక్షన్ ఎపిక్​’ అనే పేరుతో ఓ ప్యానెల్‌ను హోస్ట్ చేసి అందులో ప్రాజెక్ట్-కె ఫస్ట్ గ్లింప్స్, టైటిల్​, సినిమా విడుదల తేదీని రివీల్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news