తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఒకటి నుంచి 9 వ తరగతి పరీక్షలు వాయిదా పడి పోయాయి. ఈ పరీక్షలకు కేవలం వారం రోజుల ముందు ఈ బుధవారం షెడ్యూల్ విడుదల చేయడంతో.. తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఇక వారం రోజుల్లోనే పరీక్ష పత్రాలు ముద్రించి.. వాటిని పాఠశాలలకు చేరవేయడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తడంతో.. పరీక్షలను 9 రోజుల పాటు.. ముందుకు జరిపి.. ఈ నెల 16 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి 22 వరకు పరీక్షలు జరుగుతాయంటూ గత రాత్రి విద్యాశాఖ కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. కాగా.. ఏప్రిల్ 22 న పరీక్షలు ముగియనుండగా.. 23 వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఆ తర్వాతి రోజు నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఉండనున్నాయి.