పవన్ ఫాన్స్ కి షాక్, వకీల్ సాబ్ లేట్ అవుతుంది…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోగా, వేణు శ్రీరాం దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటుగా సినిమా ఎడిటర్ కొన్ని కారణాలతో దూరంగా ఉన్నారని, కాబట్టి సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగా, తొలి పాట ప్రోమో ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం… షూటింగ్ జరుగుతున్నా ఎడిటింగ్ లేట్ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కీలక సన్నివేశాల విషయంలో ఎడిటింగ్ అందుబాటులో లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సినిమా ఈ ఏడాది దసరా లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ అంటుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ నిపుణులను కూడా చిత్ర యూనిట్ వాడుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే పవన్ కళ్యాణ్… క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ పాత్ర కాస్త భిన్నంగా ఉంటుంది.