PSPK 26 మూవీ టైటిల్ రివీల్…. ఫ్యాన్స్ కి ఇక పండగే….!!

-

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి, తన రాజకీయ జీవితంలో నిమగ్నం అయ్యారు. అయితే ఇటీవల మళ్ళి కొద్దిరోజుల క్రితం తన తదుపరి సినిమా చేయడానికి అంగీకరించిన పవన్, ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ లో విరామం లేకుండా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా కనపడనున్న ఆ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ నిన్న రిలీజ్ అయి ఇంటర్నెట్ లో ఎంతో వైరల్ అయింది. ఇక నేడు ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. అయితే కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ సినిమా కు ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు టాక్. అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ టీ షర్ట్ తో పాటు జీన్స్ ధరించి ఉంటారని, ఆ పోస్టర్ అప్పుడే సినిమా యూనిట్ వర్గాల్లో మంచి ఆసక్తిని రేపుతోందని,ఇక నేడు సాయంత్రం 5 గంటల తరువాత అఫీషియల్ గా రిలీజ్ అయ్యాక, పవన్ ఫ్యాన్స్ కు పండగే పండగ అని అంటున్నారు.

అంజలి, నివేత థామస్, మల్లేశం ఫేమ్ అనన్య ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా మరొక లాయర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన ఫస్ట్ సాంగ్ అతి త్వరలో రిలీజ్ కానుండగా, సినిమాని మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news