కరోనా వైరస్ ని దాటేసిన పవన్ కళ్యాణ్…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ రీమేక్ చిత్రంగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఏడాది వేసవి తర్వాత ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ సినిమా. దీనితో ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న సాయంత్రం వరకు #PSPK26FirstLook టాప్‌లో ట్రెండ్ అవ్వగా.. తాజాగా #VakeelSaab ట్రెండ్ అవుతోంది. దీనికి సంబందించి దాదాపు 1.77 మిలియన్ ట్విట్స్ అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా #VakeelSaab టాప్‌లో ట్రెండ్ అవ్వడం గమనార్హం. ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా ఇదే.

ఇక కరోనా వైరస్ ని కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ దాటేసింది. ఆ వైరస్ గురించి ట్విట్టర్ లో మిలియన్ ట్వీట్స్ రాగా… పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు 1.8 వచ్చాయి. ఇక ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ ని ఇక్కడ తీస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు.