కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశ౦ ఉన్న నేపధ్య౦లో తెలంగాణా ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ హైదరాబాద్ వ్యక్తికి సోకిన నేపధ్యంలో సమావేశమైన కేబినేట్ సబ్ కమిటి సమావేశం అయింది. మంత్రి ఈటెల రాజేంద్ర నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనిపై మాట్లాడిన ఈటెల తొమ్మిది శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తామని, ప్రతి శాఖకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని నియమిస్తామన్నారు. అటు.. ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసామని అన్నారు. కరోనా అన్న అనుమానం వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రులను పంపించాలని కోరామని అన్నారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా అపోలో ఆస్పత్రికి లో వైద్య పరిక్షలు చేసారు. వారి నమూనాలను పూణే ల్యాబ్ కి పంపించారు అధికారులు.