PSPK26 పవన్ పింక్ మూవీ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ …..!!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న బాలీవుడ్ మూవీ పింక్ అధికారిక తెలుగు రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్, ఆ తరువాత రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయ్యారు. ఇక మొన్నటి వరకు తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో గడిపిన పవన్, ఇటీవల పింక్ రీమేక్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

 

అంజలి, నివేత థామస్, అనన్య తో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, బాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ దీనికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.

 

పవన్ కళ్యాణ్ షాడో ఇమేజ్ తో పాటు లాయర్ ట్యాగ్ తో ఉన్న ఈ పోస్టర్ పై అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు సినిమా యూనిట్. రేపు సాయంత్రం 5 గంటలకు అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది. దీనితో ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూపులు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం మొదలెట్టారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది…. !!

Read more RELATED
Recommended to you

Latest news