టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ బ్యూటి చుంకీ పాండే కూతురు అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను పూరి, ఛార్మిల తో పాటు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళం లో కూడా విడుదల చేన్నారు. ఇక ముందు నుంచి ఈ సినిమాకి పూరి అండ్ ఛార్మి ఫైటర్ అన్న టైటిల్ ని అనుకున్నారు. కాని అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉంటే ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ ఫుల్ గా ఉంటుందని ఫైటర్ అన్న టైటిల్ ని పక్కన పెట్టారు.
వాస్తవంగా పూరి అనుకున్న ‘ఫైటర్’ తో పాటు ‘లైగర్’ అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ రెండు టైటిల్స్ నచ్చకపోవడంతో నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తి గా లేడని తాజా సమాచారం. కరణ్ జోహార్ టైటిల్స్ విషయంలో పూరితో విభేదిస్తున్న కారణంగా ప్రస్తుతం ఇద్దరి మధ్యా చర్చలు సీరియస్ గా జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే పూరికి ఇలా టైటిల్ విషయంలో కరణ్ జోహార్ వేలు పెట్టడం నచ్చడం లేదట. ఎంత సర్దుకుపోతున్నప్పటికి ఏదో ఒక పేచి పెడుతున్నాడట.
ఇటీవలే ముంబయిలో రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు వెంట వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయిస్తున్నట్లు గా లేటెస్ట్ న్యూస్. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే రివీల్ చేసి ఉగాది న ఫస్ట్ లుక్ విడుదల చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే అసలు టైటిల్ ఏంటో ఇంకా క్లారిటి రాకపోవడంతో పూరికి ఫ్రస్టేషన్ వస్తుందట. ఈ విషయంలో విజయ్ దేవరకొండ కూడా అటు కరణ్ జోహార్ కే సపోర్ట్ గా మట్లాడుతున్నాడట.