సినిమా రంగంలో మరియు రాజకీయ రంగంలో సుబ్బిరామిరెడ్డి పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. నెల్లూరు పట్టణ ప్రాంతానికి చెందిన సుబ్బిరామిరెడ్డి గత పాతిక సంవత్సరాల నుండి పార్లమెంటులో ఏదో రకంగా తనకు పదవి ఉండేలా రాజకీయంగా రాణించి సక్సెస్ఫుల్ రాజకీయ నేతగా కెరియర్ ని లాక్కొచ్చారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఈయన మాజీ కాబోతున్నాడు. విషయంలోకి వెళితే రాజ్యసభ సభ్యుడిగా మూడవసారి ఏప్రిల్ 9వ తారీఖున ముగియ బోతోంది.అంతకుముందు విశాఖపట్టణం నుండి పార్లమెంట్ మెంబర్ గా పనిచేసిన సుబ్బిరామిరెడ్డి…నెల్లూరు నుండి విశాఖపట్టణం రాజకీయాలలో కీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటినుండో విధేయుడిగా ఉంటూ ఎక్కడా కూడా హైకమాండ్ కి విరుద్ధంగా పోలేదు. ఒకపక్క రాజకీయ రంగంలో మరోపక్క సినిమా రంగంలో రాణించిన సుబ్బిరామిరెడ్డి బ్యాడ్ డేస్ దగ్గరపడ్డాయి. విషయంలోకి వెళితే దాదాపు పాతిక సంవత్సరాలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన సుబ్బిరామిరెడ్డికి ఏప్రిల్ నెలలో తన పదవీకాలం ముగియడంతో అయ్యో సుబ్బిరామి రెడ్డి ఇంకా పార్లమెంటు ఆవరణలో కనబడరా…? అని సీనియర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో మళ్లీ పెద్దల సభకు వెళ్లాలంటే ప్రస్తుతం సుబ్బిరామిరెడ్డికి ఉన్నా ఓకే దిక్కు జగన్ అన్న టాక్ బలంగా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి చాలా సన్నిహితంగా సంబంధాలు ఉన్న సుబ్బిరామిరెడ్డికి వైయస్ జగన్ తో మాత్రం అంత పెద్ద బంధం ఏమీ లేదు. మరి సుబ్బిరామిరెడ్డి తన పార్టీలోకి వస్తే జగన్ ఏదైనా పదవి ఇచ్చే ఛాన్స్ ఉందో లేదో చూడాలి.