బన్నీ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్.. ఆరోజే పుష్ప-2 టీజర్ రిలీజ్..!

-

పుష్ప- ది రైజ్ సినిమా 2021లో విడుదలై బ్లాక్​బస్టర్ హిట్​ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్​లో ఈ మూవీకి వచ్చిన క్రేజ్ చూసి ఈ టీమ్​.. సీక్వెల్​ను ప్లాన్ చేసింది. పుష్ప- ది రూల్ పేరుతో పార్ట్​-2 వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్​.. బర్త్​ డే(ఏప్రిల్​ 8) నాడు ఫ్యాన్స్​కు అదిరిపోయే సర్​ప్రైజ్​ ఇవ్వనున్నారట మేకర్స్​. మూడు నిమిషాల పాటు సాగే టీజర్​ను​ రిలీజ్​ చేయబోతున్నారట. ఇందులో ఎలాంటి మాటలు ఉండవట. కేవలం యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్ షాట్స్ మాత్రమే ఉంటాయట. అన్ని భాషలకు రీచ్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశారట.

మరోవైపు, ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్​చల్​ చేస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు కోట్లు కురిపిస్తోందట! థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసిందట. అయితే ఈ విషయంపై ఎక్కడా కూడా అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news