Pushpa 2 : విశాఖలో పుష్ప-2 షూటింగ్?

-

2021 లో సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా.. సమంత స్పెషల్ సాంగ్ లో అలరించిన చిత్రం పుష్ప.. ఇందులో సునీల్, అజయ్, అనసూయ తదితరులు నెగిటివ్ రోల్ పోషించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

మొదటి సినిమా భారీ సక్సెస్ పొందడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

అయితే, ‘పుష్ప: ది రూల్’ సినిమా షూటింగ్ క్రమంగా ఊపందుకుంటుంది. ఇటీవలే కొన్ని సన్నివేశాలను హైదరాబాదులో చిత్రీకరించగా, ఈ వారంలో విశాఖలోనూ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇందుకోసం హీరో అల్లు అర్జున్ నేడు విశాఖకు వెళ్ళనున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. 10-15 రోజులు పాటు అతనిపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. కాగా రష్మిక వచ్చే నెలలో మూవీ షూటింగ్ లో పాల్గొననుంది.

Read more RELATED
Recommended to you

Latest news