IND VS NZ : ‘సచిన్ అల్లుడు డబుల్ సెంచరీ చేశాడుగా’.. మీమ్స్ వైరల్

-

ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ విజయం సాధించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ జట్టు సగం వికెట్లను కోల్పోయింది. 25 ఓవర్లకు కివీస్ 5 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది. ఇక చివరి ఓవరలో సెంచరీ వీరుడు మైఖేల్ బ్రేస్‌వెల్ ఔట్ కావడంతో.. 337 పరుగులకే ఆలౌట్ అయింది.

దీంతో టీమిండియా 12 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌ లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. నయా స్టార్ శుబ్ మన్ గిల్ డబుల్ సెంచరీ బాధడంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతడు సచిన్ అల్లుడు అని, ఈ ఇన్నింగ్స్ చూసి సచిన్ పిలిచి పిల్లనిస్తాడని మీమ్స్ చేస్తున్నారు. గర్వంగా ఫీలై ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సచిన్ కూతురు సారా తో గిల్ డేటింగ్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. కానీ గిల్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో షికారు చేసిన ఫోటోలు కొద్దిరోజుల క్రితం వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news