“పుష్ప” ట్యూన్స్ రెడీ …!

-

ముచ్చటగా మూడోసారి బన్నీ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పుష్ప సినిమా నుండి కొన్ని రోజుల క్రితం విడుదలైన తొలి పోస్టర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. పుష్ప సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత బాణీలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే సినిమా కోసం స్వరాల ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది.

pushpa
pushpa

ప్రభుత్వాల నుండి సినిమా షూటింగ్లకు అనుమతి వచ్చిన పుష్ప సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. లాక్ డౌన్ సమయం షూటింగులకు సహకరించకపోవడంతో షూటింగ్ పక్రియను ప్రారంభించలేదు చిత్రబృందం. ఇకపోతే ఈ సమయాన్ని సుకుమార్ దేవిశ్రీ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా వీరిద్దరూ వర్చువల్ మ్యూజిక్ స్టేషన్లను నిర్వహించారు. దీనితో వారు ట్యూన్స్ ఎంపిక పూర్తి చేశారని తెలుస్తోంది. బన్నీ నటించబోయే పుష్ప సినిమాలో మొత్తంగా ఐదు పాటలు ఉంటాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news