రాధే శ్యామ్.. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల..

-

ప్రభాస్ హీరోగా రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ చిత్రం నుండి హీరోయిన్ పూజా హెగ్డే లుక్ రివీల్ చేసారు. యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తుంది. లోకల్ ట్రైన్ లో ఎక్కడికో వెళ్తున్నట్లుగా ఉన్న ఆ లుక్ లో పూజా హెగ్డే చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్లని చూస్తుంటే యూరప్ వాతావరణ కొట్టొచ్చినట్టుగా ఉంది.

పీరియాడిక్ డ్రామాగా సాగే కథ కాబట్టి కలర్లో కొంచెం విభిన్నత కనిపిస్తుంది. చూడగానే ఆ కాలంలోకి తీసుకెళ్తున్నట్లుగా ఉంది. పోస్టర్ మొత్తం ఆకుపచ్చదనం హైలైట్ గా చేయడం చాలా బాగుంది. పూజా హెగ్డే గెటప్ కథలొకి తీసుకెళ్తుంది. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గోపీక్రిష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news