జగన్ కు థాంక్స్ చెప్పిన జర్నలిస్ట్ లు…!

-

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు ల కుటుంబ సభ్యులు కు ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు సిఎం జగన్మోహన్ రెడ్డి. దీనిపై జర్నలిస్ట్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లక్ష మందికి పైగా చనిపోయారు అని అన్నారు. వీరిలో జర్నలిస్టు లు కూడా అనేక మంది ఉన్నారు అని చెప్పారు.Journalists' working conditions hit hard by coronavirus- The New Indian  Express

రోజు‌వారీ వార్తల‌సేకరణ కోసం‌ వెళ్లిన విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ఈ కరోనా బారిన పడ్డారని అన్నారు. ప్రధాని మోడీ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టు లు కూడా వస్తారని ప్రకటించారని వివరించారు. ఈ నిర్ణయాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి సాయం అందించారని, ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి ని కలిసి జర్నలిస్టు ఇబ్బందులు వివరించామని అన్నారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు ల కుటుంబాలకు యాభై లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. అక్టోబర్ 2న ఆందోళనలు చేసిన ఫలితంగా ప్రభుత్వం స్పందించిందని సిఎం జగన్ కు ధన్యవాదాలు చెప్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news