మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు..అని అప్పుడు ఊపిరి తీసుకోకుండా బాలు సర్ పాడారు.ఆ సంద్రపు తీరాల్లో ఆ చిన్నదాని వలపు పంటలు ఎలా ఉన్నాయో కానీ ఇప్పుడు ఆమె మలి సంధ్యల్లో ఉన్నారు. ప్రేమకు ఆనవాలుగా ఉన్నారు. బిడ్డలు వాళ్ల బిడ్డలు ఇలా ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉండడమే జీవితం అనే ఓ అవధిని నిర్ణయించుకుని ఉండడంలో రాడాన్ రాధిక ఉన్నారు. అవును! ఆమె టెలివిజన్ డాన్ రాడాన్ అధినేత మరిచిపోతామా!
- శ్రుతి నీవు గతి నీవు అని పాడుకున్న రోజులు గుర్తున్నాయి..స్వాతి కిరణం చెంత.. అలాంటి సందర్భంలో ఆమె గొప్పగా కనిపించారు. జీవన సంధ్యల్లో కూడా శ్రుతి ఎవరిది గతి ఎవరిది? బుజ్జి పిల్లలతో ఆడుకుంటూ ఆనందాలు పంచుకుంటూ పోవడంతో ఒక పరిణితి పొంది ఉండాలి. భావోద్వేగ పరిణితి అన్నది అంతిమం అయి ఉండాలి. ఉందా? తప్పక ఉంటుంది!
2. పిల్లలంతా ఏమవుతారు అని అడిగారు ఓ చోట ఓ పెద్ద కవి.. ఏమీ కాకుండా ఎందుకు ఉంటారు.. నవ్వుల్లో ఉంటూ నవ్వు అయి పోతారు.. పువ్వుల్లో ఉంటూ పూల పరిమళం ఒంటికి రాస్తారు.. మట్టిలో ఉంటూ మట్టి ని ఒంటికి రాసి గొప్పగా తమని తాము నిర్వచించుకుంటారు. అలాంటి పిల్లలతో అలాంటి బాల్యంతో ఆమె.. హాయికి నిలువెత్తు నిదర్శనం అవుతూ…
3. మనుషులంతా గొప్పవారు అని రాసుకోవాలి.. రాధిక అనే వసంతం చెంత మనుషులు ఎలా ఉన్నారు.. ఒక నాటి జీవితం ఒక నాటి వైభవం ఇప్పటి కొనసాగింపు అన్నీ బాగున్నాయి.. మళ్లీ మళ్లీ మలి సంజె వెలుగుల్లో కొత్త కాంతికి అర్థం పిల్లలతో పెరగడం పిల్లల్లో ఒదగడం.. పెరగడం వైభవం ఒదగడం బాధ్యత.. వైభవాన్నీ వికాసాన్నీ నవ్వుల్లో పొందితే జీవితం పరిపూర్ణం.
ఆయుష్మాన్ భవ! ఆహా మరోసారి అనండి నవ్వింది మల్లె చెండు నచ్చింది..గాళ్ ఫ్రెండూ అని! ఆ..స్వేచ్ఛారీతికి వందనం.
– చిత్రం చెప్పిన కథ – మనలోకం ప్రత్యేకం