టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు రాజమౌళి.. జక్కన్నకు అరుదైన గౌరవం..

-

టాలీవుడ్ జక్కన్న, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. RRR ఫిల్మ్ తో తెలుగు చిత్ర స్థాయిని పెంచిన దర్శకుడిగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళికి.. ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌-2022(టీఫ్‌) నుంచి ఆహ్వానం అందింది.

ఈ విషయాన్ని టీఫ్‌ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. హాలీవుడ్‌ ప్రముఖలతో కలిసి ఈ ఏడాది టీప్‌ వేడుకలో రాజమౌళి చర్చావేదికలో పాల్గొననున్నారు. అలా హాలీవుడ్ అగ్రదర్శకులతో చర్చలు జరిపే అరుదైన అవకాశం, గౌరవాన్ని రాజమౌళి త్వరలో పొందనున్నారు. వచ్చే నెల 8 నుంచి 18 వరకు ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి.

కెనడాలోని టొరంటోలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరగనుంది. ఏటా ఈ వేడుకలను నిర్వాహకులు నిర్వహిస్తారు. టొరంటో ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం అందిన తొలి భారతీయుడిగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి నిలిచారు. ‘బాహుబలి’, ‘RRR’ మూవీస్ తో తెలుగు మూవీ స్థాయిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తీసుకెళ్లిన రాజమౌళి.. తన నెక్స్ట్ ఫిల్మ్.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news