రాజ‌మౌళి మాయాజాలం బాహుబ‌లి చ‌రిత్ర‌కు నేటికి ఆరేళ్లు..!

ఇండియ‌న్ సినిమా చరిత్ర‌లో బాహుబ‌లిది అగ్ర స్థానం అనే చెప్పాలి. ఇప్ప‌టికీ ఈ సినిమాను త‌ల‌ద‌న్నే మూవీ ఇంకా రాలేద‌నే చెప్పాలి. ద‌ర్శ‌క ధీరుడు అయిన రాజమౌళి మాయాజాలం చేసి తీసిన ఈ సినిమా ఒక చ‌రిత్ర సృష్టించింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఎన్నో రికార్డుల‌ను ఇప్ప‌టికీ న‌మోదు చేస్తూనే ఉంది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన మెప్పించార‌నే చెప్పాలి.

అయితే ఇంత‌టి సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఈ మూవీకి నేటికి ఆరేళ్లు పూర్తి చేసుకుంటుంది. బాహుబలి మూవీ సృష్టించిన సంచలనం దేశ వ్యాప్తంగా మ‌రుమోగి పోయింది. ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకుని రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొడుతూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

ఇప్ప‌టి వ‌ర‌కు మన దేశంలో అత్య‌ధిక వసూళ్లు రాబ‌ట్టిన సినిమాగా బాహుబ‌లి మాత్ర‌మే ఉంది. ఇంత వ‌ర‌కు ఆ రికార్డు చెర‌గ‌లేదు. డిజిటల్ యుగంలో మన దేశంలోనే ఎక్కువ మంది అభిమానులు చూసిన మూవీగా కూడా బాహుబ‌లి ఉంది. బాలీవుడ్ ఖాన్ ల‌ను వెన‌క్కు నెట్టి మ‌రీ ప్ర‌భాస్ సినిమా సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఇందులో ప్రభాస్, అనుష్కల‌తో పాటు రాణా, త‌మ‌న్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్‌లు మెయిన్ రోల్స్ చేసి సినిమాను మ‌రో లెవెల్‌కు తీసుకెల్లారని చెప్పాలి.