స్టీవెన్సన్ మరణ వార్తను నమ్మలేకపోతున్నా : రాజమౌళి

-

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ప్రధాన విలన్‌ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) సోమవారం మరణించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ లో స్కాట్ దొరగా రే స్టీవెన్సన్ చక్కటి విలనిజం పండించారు.

ఇక RRR నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణంపై దర్శకుడు రాజమౌళి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘స్టీవెన్సన్ మరణ వార్త విని షాక్ అయ్యా. ఆయన ఇక లేరంటే నమ్మలేకపోతున్నా. RRR షూటింగ్ సెట్ లో హుషారుగా ఉంటూ అందరినీ ఉత్సాహపరిచేవారు. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. స్టీవెన్సన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలి యజేస్తున్నా. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని ట్విట్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news