సార్ సార్ అంటూ నీళ్లు నములుతున్న రాజమౌళి..!

-

చిరంజీవి ఎంత ఉత్సాహంగా ఉన్నాడో.. ఎంత ఊపులో ఉన్నాడో వాటిపై రాజమౌళి నీళ్లు చల్లేశాడు. రామరాజు కోసం భీమ్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తాడో చూద్దామని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మెగాస్టార్‌కు నిరాశనే మిగిల్చాడు. ఉదయం పది గంటలు ఎప్పుడవుతుందా? అని చూసిన చిరంజీవికే చుక్కులు చూపిస్తూ.. సార్ సార్ అంటూ ప్రస్తుతం నీళ్లు నములు తున్నాడు రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ సర్‌ప్రైజ్ ఏంటో చూద్దామని ఎంతో ఆత్రుతగా ఉన్న చిరు.. ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఇంటర్వెల్ సీన్‌లో విలన్‌కు వార్నింగ్ ఇచ్చే ఈ సీన్‌ను రిపీట్ చేశాడు. వెయిటింగ్ అంటూ అక్కడ చెప్పే డైలాగ్‌ను ఈ సందర్భంగా వాడాడు. ఆర్ఆర్ఆర్ కోసం తాను వెయిటింగ్ ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలన్నట్టుగా రెడీగా ఉన్నారు.

అయితే ఆ సర్ ప్రైజ్ ఆలస్యం కానుందని, రామ్ చరణ్‌కు ఇవ్వాల్సిన గిఫ్ట్ రాత్రికి రాత్రే రాజమౌళి చేతికి మారిందని, దీంతో ఆలస్యం కానుందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు ఈ సందర్బంగా రాజమౌళి చిరు ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. సార్‌ర్‌ర్.. అంటే అది కొంచెం కొంచెంద యాక్చువల్‌గా.. ప్లీజ్ సర్ అంటూ నీళ్లు నమిలాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news