రాజమౌళి కొడుకు సడెన్ ఎంగేజ్‌మెంట్

-

ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ ఎంగేజ్‌మెంట్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. చాలా సీక్రెట్ గా ఈ నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న పూజా ప్రసాద్ ను పెళ్లాడేందుకు నిశ్చితార్ధం చేసుకున్నాడు కార్తికేయ. రాజమౌళి కొడుకుగా ప్రపంచానికి తెలిసినా కార్తికేయ, రాజమౌళికి సొంత కొడుకు కాదు అన్నది ఈమధ్యనే రివీల్ చేశారు.

ఇక పూజా ప్రసాద్ విషయానికొస్తే.. సింగర్ గా కెరియర్ సాగిస్తున్న ఆమె హీరో కం విలన్ జగపతి బాబుకి స్వయానా అన్న కూతురే. జగపతి బాబు అన్న రామ్ ప్రసాద్ కూతురైన పూజా ప్రసాద్ ను కార్తికేయ ప్రేమించడం వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి బాజాలు మోగించేందుకు సిద్ధమయ్యారు. ఇంకా అఫిషియల్ గా వారు ఈ ఎంగేజ్‌మెంట్ కు సంబందించిన పిక్స్ కూడా రివీల్ చేయలేదు.

కార్తికేయ బాహుబలి-2కి సెకండ్ యూనిట్ డైరక్టర్ గా పనిచేశాడు. అంతేకాదు వారాహి చలన చిత్ర బ్యానర్ లో లైన్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశాడు. త్వరలోనే అతను మెగా ఫోన్ పట్టుకుంటాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version