కన్నడ రాక్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కె.జి.ఎఫ్ చాప్టర్ 1. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆశ్చర్యపరచింది. టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ఈ ట్రైలర్ ఇంకా ఆ క్రేజ్ డబుల్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్ గా జరిగింది.
తెలుగు, తమిళ, హింది, మళాయాళ, కన్నడ భాషల్లో కె.జి.ఎఫ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా రాజమౌళి మాట్లాడుతూ నాలుగైదేళ్ల క్రితం కర్ణాటక పరిస్థితి సాయిని అడిగితే యశ్ గురించి చెప్పాడని.. బస్ డ్రైవర్ కొడుకు స్టార్ హీరో అయ్యాడు. తనకు బాగా నచ్చిన విషయం ఏంటంటే కొడుకు స్టార్ అయినా ఇప్పటికి యశ్ తండ్రి బస్ నడపడం విశేషం. ఆయన అసలైన సూపర్ స్టార్ అన్నాడు రాజమౌళి.
ఇక ఈ సినిమా విజువల్స్ చూసి ఇదో పాన్ ఇండియా మూవీ అని అనుకున్నానని చెప్పారు. చిత్రయూనిట్ అంతా బాగా కష్టపడిందని.. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందని అభిప్రాయం చెప్పారు రాజమౌళి. రాజమౌళి రిఫర్ చేయబట్టే ఈ సినిమా ఇంత భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుందని జక్కన్న మాటల్లో తెలుస్తుంది.