ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన సుధీర్ బాబు తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకోవడంలో ఇంకా వెనుకపడి ఉన్నాడని చెప్పాలి. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్నా ఎందుకో అందుకు తగిన సక్సెస్ లను అందుకోలేకపోతున్నాడు సుధీర్ బాబు. ఈమధ్యనే సమ్మోహనం సినిమాతో హిట్ అందుకున్న సుధీర్ బాబు లేటెస్ట్ గా మరో ఎక్స్ పెరిమెంట్ కు సిద్ధమయ్యాడని తెలుస్తుంది.
కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఆన్ స్క్రీన్ పై అలరిస్తూనే మాటల రచయితగా, దర్శకుడిగా తన మార్క్ చూపించాలని తపన పడుతున్నాడు హర్షవర్ధన్. మనం సినిమాకు మాటల రచయితగా హర్షవర్ధన్ ప్రతిభ కనబరిచాడు. రీసెంట్ గా గుడ్, బ్యాడ్, అగ్లీ అంటూ శ్రీముఖితో ఓ ప్రయోగం చేసినా అంతగా సక్సెస్ అవలేదు. లేటెస్ట్ గా సుధీర్ బాబు, హర్షవర్ధన్ కలిసి ఓ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ సినిమా కాన్సెప్ట్ అదిరిపోతుందట. ఈమధ్య తెలుగులో ప్రయోగాలు ఎక్కువవుతున్నాయి. ఆడియెన్స్ కూడా కొత్త రకమైన సినిమాలను కోరుకుంటున్నారు. అందుకే హర్షవర్ధన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సుధీర్ బాబు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. ఈ మూవీతో అయినా సుధీర్ హిట్ కొడతాడా అన్నది చూడాలి.