రాజమౌళి డైరక్షన్ లో రాబోతున్న ఎన్.టి.ఆర్, చరణ్ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ఈరోజు మొదలైంది. రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్నట్టుగానే ఈరోజు అట్టహాసంగా మొదలైంది. కెమెరా ముందు కూల్ గా రాజమౌళి తన ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్న వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రెడీ ఎవ్రీ వన్ రెడీ.. లెట్స్ గో ఫర్ టేక్.. బ్యాగ్రౌండ్ రెడీయా.. చరణ్ రెడీ.. తారక్ రెడీ.. యా క్లాప్ ఇన్.. సౌండ్… క్లాప్.. యాక్షన్ అంటూ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మొదలు పెట్టాడు.
మెగా నందమూరి మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమా బాహుబలి తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమా అవుతుందని అంటున్నారు ఇద్దరి హీరోల ఫ్యాన్స్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి దిగిన మరో పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటిరోజు షూటింగ్ లోనే లీడ్ యాక్టర్స్ ను ఇన్వాల్వ్ చేసిన రాజమౌళి ఇద్దరికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పొచ్చు.
ACTION!!
The first shot of the MASSIVE MULTISTARRER has been DONE. #RRRShootBegins @tarak9999 #RamCharan @ssrajamouli @srinivas_mohan @DOPSenthilKumar @DVVMovies pic.twitter.com/eUkWYuFRZF
— RRR Movie (@RRRMovie) November 19, 2018