స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ `రాజ్ ధూత్` సినిమాతో హీరోగా పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్నటి రోజున సినీ ప్రముఖలు సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శ్రీహరితో అనుబంధం ఉన్న దర్శకులు, నటులు అంతా తరలి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీహరితో తమ మైత్రీని గుర్తు చేసుకున్నారు. శ్రీహరి వల్ల జీవితంలో స్థిరపడిన వాళ్లు ఇండస్ర్టీలో చాలా మంది ఉన్నారని అంటుంటారు. అందులో కొంత మంది నేడు స్టార్ దర్శకులుగా, నిర్మాతలుగా వెలుగొందుతున్నారని నిన్నటి రోజున బయట పడింది. అలాగే ఆయన ఎవరెవరికి ఎలాంటి సహాయాలు చేసారన్నది నిర్మోహమాటంగా సాయం పొందిన వారు చెప్పడం విశేషం.
దర్శకులు కె.ఎస్ రవికుమార్, దేవి ప్రసాద్, బాబి, నిర్మాత సి. కళ్యాణ్, నిర్మాత బెల్లంకొండ సురేష్, ఫైట్ మాస్టర్ విజయ్ ఇలా చాలా మంది శ్రీహరి వల్ల సహాయం పొందిన వారే. వాళ్ల జీవితాలను నిలబెట్టింది శ్రీహరి అనేనని సభాముఖంగా తెలిపారు. సి.కళ్యాణ్ , బెల్లకొండ నిర్మాత అవ్వడానికి కారణం ఆయనే. ఇండస్ర్టీలో టెక్నీషియన్లను , దర్శకులను బెల్లకొండకు పరిచయం చేసింది శ్రీహరేనని బెల్లంకొండ తెలిపాలు. ఇక సి. కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీలో ఇల్లు కొనిచ్చింది శ్రీహరి అని ఆయన తెలిపారు. ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడానికి శ్రీహరి ఒక్కడే కారణమన్నారు. శ్రీహరిని బావ-శాంతిని అక్క అనడమే కాకుండా…వాళ్ల ఇంట్లో చనువుగా తిరగే రిలేషన్ ఉంది అన్నారు.
ఇక దర్శకుడు బాబి సినిమా ప్రస్థానం భద్రాద్రి తో ప్రారంభమైందన్నారు. శ్రీహరితో తనకున్న బెస్ట్ మూవ్ మెంట్ ని పంచుకున్నాడు. ఒక ఫ్యామిలీ షిరీడీ నుంచి బస్సులో వస్తుంటే కొంత మంది మద్యం సేవించి ఆ ఫ్యామిలీని తిట్టారుట. దీంతో ఆ వ్యక్తి శ్రీహరికి ఫోన్ చేసి విషయం చెప్పే సరకి బస్సు హైదరాబాద్ చేరుకునే సమయానికి శ్రీహరి లుంగీ కట్టుకుని వెయిట్ చేసారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని బాబి తెలిపారు. ఇలా ముక్కు ముఖం తెలియని ఎందరికో ఆయన సహాయం చేసారు. అప్పుడే శ్రీహరి గారిలో దేవుడిని చూసానన్నారు. అలాగే శ్రీహర ఇసహాయం వల్ల రాజకీయాల్లోనూ స్థిరపడ్డారని కొంత మంది వక్తలన్నారు.