హాలీవుడ్ ను తలదన్నేలా… రజినీ 2.0 ట్రైలర్

-

Rajinikanth 2-0 trailer released

హాలీవుడ్ సినిమాలు కూడా తేలిపోవాల్సిందే.. అన్నట్టుగా ఉంది రోబో 2.0 ట్రైలర్. శంకర్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీ కాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఇది. దాదాపు మూడేళ్ల నుంచి శంకర్ ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాడు. 543 కోట్ల బడ్జెట్ తో రూపొందింది ఈ సినిమా. సినిమా షూటింగ్ అంతా 3డీ కెమెరాలతో తెరకెక్కించారు. నవంబర్ 29 న సినిమా రిలీజ్ కానుంది. ఇదివరకే సినిమా పోస్టర్లను, టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేయగా.. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు. హాలీవుడ్ ను తలదన్నేలా ఉంది. 4డీ సౌండ్ టెక్నాలజీతో ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంది.

ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ చెన్నైలోని సత్యం సినిమాస్ లో జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీ కుటుంబం, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హాజరయ్యారు. రజినీకాంత్ మరో సారి రోబో చిట్టీగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ హీరో అక్షయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ ట్రైలర్ కు రజినీ యాక్షన్, అక్షయ్ కుమార్ లుక్, అమీ గ్లామర్ ప్లస్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news